కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఇండియా బెస్ట్ కాలేజెస్ ర్యాంకింగ్స్‌లో జాతీయ స్థాయిలో విశిష్ట స్థానాలను దక్కించుకున్నట్లు చాన్స్‌లర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి తెలిపారు. డీ వీక్–హంసా రీసెర్చ్ సర్వే–26 విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో మిట్స్ స్థానం దక్కించుకుందన్నారు. మిట్స్‌కు ఆలిండియా ఇంజినీరింగ్ కళాశాలల విభాగంలో140 ర్యాంకు, దేశంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 114 ర్యాంకు, దక్షిణ భారత ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 74వ ర్యాంకు, రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలలో 11 ర్యాంకు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది యూనివర్సిటీ విద్యా ప్రమాణాలకు, ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు.


