గోతులు తీసి మొక్కలు నాటారు | - | Sakshi
Sakshi News home page

గోతులు తీసి మొక్కలు నాటారు

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

రాయచోటి : రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమంపై మున్సిపల్‌ అధికారులు స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘మానులవుతున్న అవినీతి మొక్కలు’ శీర్షికతో ప్రచురితమైంది. దీనిపై సంబంధిత ఇంజినీర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందించారు. డివైడర్స్‌ మధ్యలో నాటిన మొక్కలు ప్రాంతాలను పరిశీలించారు. డివైడర్ల మధ్యలో ఎర్రమట్టిని తోలించి, లోతైన గోతులు తవ్వించి మిగిలిన ప్రాంతాలలో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే గతంలో నాటిన మొక్కల స్థానంలో కూడా ఎర్రమట్టిని తోలి ట్యాంకర్ల సాయంతో సమృద్ధిగా నీటిని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement