మదనపల్లె సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 1,803 ప్రభుత్వ పాఠశాలల్లో ‘మెగా పీటీఎం–4.0’ (తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల సమావేశం) నిర్వహిస్తున్నట్లు డీఈఓ సుబ్రమణ్యం, సమగ్రశిక్ష ఏసీపీ అనూరాధ తెలిపారు. గురువారం డీఈఓ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాఠశాలల అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశానికి వచ్చే ప్రతి తల్లిదండ్రుల మొబైల్‌లో శ్రీలీప్ యాప్‌శ్రీ డౌన్‌లోడ్ చేయించి, అవగాహన కల్పిస్తామన్నారు. హాజరైన వారందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కాయలు తోలిన రైతుందరికి సహాయం
పులిచెర్ల(కల్లూరు): మామిడికాయలు ఫ్యాక్టరీలకు తోలిన రైతులందరికీ ప్రభుత్వం అదనంగా ఇచ్చేరూ.4ను సహాయం అందేలా చూస్తామని ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టరు కోటేశ్వర రావు తెలిపారు. గురువారం పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశంలో మాట్లాడారు. ప్రతి రైతు సేవా కేంద్ర సిబ్బంది గ్రామాల్లో పర్యటించి మామిడి కాయలు ఫ్యాక్టరీలకు తోలిన రైతుల వివరాలు ర్యాంపుల దగ్గర నమోదు చేసిన పేర్లు, వారి, భూమి వివరాలు, ఇంటిలో ఎవరి పేరున తోలారు తదితరాలను రికార్డు చేయాలన్నారు. ప్రభుత్వసాయం కాయలు తోలిన ప్రతి రైతుకు అందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి సంతోషి కుమారి, మండల వ్యవసాయ శాఖాధికారిణి లీలాకుమారి, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.


