పక్కాగా యోగాంధ్ర నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పక్కాగా యోగాంధ్ర నిర్వహణ

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

సాక్షి, మదనపల్లె: యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించారు. వీసీలో ఆయన మాట్లాడుతూ జూన్‌ 7 నుంచి 20 వరకు థీమాటిక్‌ యోగా, టూరిస్ట్‌ యోగా, టెంపుల్‌ యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మున్సిపల్‌ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీనిపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఆసనాలు, ప్రాణాయామం, సింక్రొనైజ్డ్‌ యోగా, క్విజ్‌, నినాదం, వ్యాసరచన పోటీలను నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్లు, శాఖల అధికారులు పాల్గొన్నారు.

పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

మదనపల్లె సిటీ: పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ది (పీకేఎంయూడీఏ) పరిధిలో చేపడుతున్న అభివృద్ది పనులు వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌,పీకేఎంయూడీఏ వైస్‌ చైర్మన్‌ శివ్‌నారాయణశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్ణణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌శాఖల ప్రగతి, సమస్యల పరిష్కారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పీకేఎంయూడీఏ ద్వారా ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కింద అభివృద్ది చేయడానికి ప్రతిపాదించిన స్థలాల్లో ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా లేఔట్‌ ప్లాన్లు రూపొందించాలన్నారు. పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement