మదనపల్లె టౌన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 20 లక్షల విత్తన బంతుల తయారీ కార్యక్రమానికి మదనపల్లెలో శ్రీకారం చుట్టినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ ఎస్.ఎన్. అహ్మద్ తెలిపారు.శుక్రవారం మదనపల్లెలోని బసినికొండ నగర వనంలో విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సామాజిక వనవిభాగం డీఎఫ్‌ఓ శివకుమార్, ఎఫ్‌ఆర్‌ఓ జయప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.
రామయ్య సన్నిధిలో
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్యను శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృపాసాగర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. రంగమండపంలో వారిని ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.


