పులిచెర్ల (కల్లూరు) : కల్లూరులో వాహనం సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు బీసీ కాలనీలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. వారిని చూసిన కారు డ్రైవర్ కొంత దూరం వెళ్లి.. వాహనాన్ని వదిలి పారిపోయాడు. పోలీసులు పరిశీలించగా.. కారులో 12 ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని గమనించారు. వాహనాన్ని కల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అందులో 12 దుంగల బరువు 358 కేజీలుగా గుర్తించారు. వాటి విలువ రూ.16.46 లక్షలు, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఆరుగురు యువకుల
బైండోవర్
సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోటలో న్యూసెన్స్ సృష్టిస్తున్న ఆరుగురు యువకులను శుక్రవారం బైండోవర్ చేసినట్టు సీఐ కే.గోపాల్‌రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన ఎన్.సుదర్శన్ (23), డి.కళ్యాణ్ (23), ఎం.గిరిష్‌కుమార్ (22), ఎస్.అల్లాబకష్ (19), ఎ.హర్షవర్దన్ (20), టి.గణేష్(20)లు న్యూసెన్స్ సృష్టిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారిని బైండోవర్ చేసి ఆర్‌ఎస్‌డిటి బాలాజీ ఎదుట హాజరు పరిచినట్టు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ ఇచ్చామని సీఐ తెలిపారు.


