వాల్మీకిపురం : మండలంలోని నగరిమడుగు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో దాదాపు 10 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న కేబుల్ వైర్లను చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగిరిమడుకు చెందిన రెడ్డెప్ప, శ్రీరాములు, జ్యోతి, నరసింహారెడ్డి, రెడ్డెప్ప, వెంకటరెడ్డి, రామాంజులు, నాగమ్మ, రామయ్య తదితర రైతుల వ్యవసాయ భూముల వద్ద 200 మీటర్లకు పైగా ఉన్న కేబుల్ వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు శుక్రవారం గుర్తించారు. అసలే వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తుంటే మరో పక్క వైర్లను చోరీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చొరవ చూపి కేబుల్ వైర్ల దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.


