రామసముద్రం : అదుపుతప్పి ఇసుక ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం ఎలవనెల్లూరు పంచాయతీ పైగడ్డ నుంచి బల్లసముద్రం వైపు మీదుగా ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి రహదారి పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి గాయపడిన డ్రైవర్‌ను బయటికి తీసి చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్ అనపల్లి కొత్తూరుకు చెందిన వ్యక్తిగా సమాచారం.


