కనీస అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

కనీస అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

డీఈఓ సుబ్రమణ్యం

మదనపల్లె సిటీ: నిపుణ్‌భారత్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థుల తరగతి స్థాయిని బట్టి కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ కె.సుబ్రమణ్యం అన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయుల కోసం ఆరు కేంద్రాల్లో నిర్వహిస్తున్న ‘జ్ఞాన ప్రకాష్‌’ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేసి, విద్యార్థి కేంద్రిత బోధనా విధానాల ద్వారా వారి నైపుణ్యాల అభివృద్దికి ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమగ్రశిక్ష అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి జి.కరుణాకర్‌, కోర్సు కో ఆర్డినేటర్‌ ప్రభాకర్‌రెడ్డి, సెంటర్‌ ఇన్‌చార్జ్‌ పద్మావతి, ఉపాధ్యాయులు, డీఆర్‌పీలు పాల్గొన్నారు.

కొత్త తరహా విద్యాబోధన అందించాలి

పీలేరు : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కొత్త తరహా విద్యాబోధన అందించాలని రాష్ట్ర పరిశీలకులు విజయకుమార్‌ అ న్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్షరాస్యతా అభివృద్ధి కోసం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆరు రోజుల శిక్షణ కార్య క్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన ఆయన మా ట్లాడుతూ ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ప్రా థమిక అక్షర జ్ఞానం, సంఖ్యాజ్ఞానం, పాఠ్య పుస్తకాల మార్పులపై అవగాహన పెంచుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement