దాతలూ.. సాయం చేయరూ ! | - | Sakshi
Sakshi News home page

దాతలూ.. సాయం చేయరూ !

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

మదనపల్లె టౌన్‌: ఏడు నెలలకే జన్మించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కవల బిడ్డలను కాపాడుకునేందుకు పీటీఎం మండలానికి చెందిన దంపతులు దాతల సాయం కోసం అర్థిస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం, పీటీఎం మండలానికి చెందిన సాయి వర్ధన్‌, శిరీష దంపతులకు ఇద్దరు మగ బిడ్డలు జన్మించారు. నెలలు నిండకుండానే పుట్టడంతో ఇద్దరు చిన్నారులు కేవలం 800 గ్రాముల బరువుతో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం చిన్నారులను బెంగళూరులోని రెయిన్‌బో ఆసుపత్రిలో చేర్చి ఎన్‌ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నప్పటికీ, రోజుకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోందని తల్లి శిరీష తెలిపారు. గురువారం మదనపల్లె ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన శిరీష, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇంత భారీ మొత్తం భరించలేమని కన్నీటి పర్యంతమయ్యారు. కళ్లముందే ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డలను కాపాడు కునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు మానవతా దక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని వేడుకున్నారు. దాతలు ఫోన్‌ పే నెంబర్‌ 8143633396 నంబర్‌కు ఆర్థిక సహాయం అందిం చాలని విన్నవించారు.

ఏడు నెలల కవలల చికిత్స కోసం

తల్లిదండ్రుల వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement