కేవీపల్లె : సమాజ శ్రేయస్సే ధ్యేయంగా రెండు దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ’ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్’ సంస్థ తన సేవా పరిధిని మరింత విస్తృతం చేసింది. సమాజానికి నిస్వార్థంగా సేవలందించే వారే నిజమైన హీరోలని గుర్తిస్తూ.. ఇటీవల భాగ్యనగరంలో ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఘనంగా ‘నిర్వి అవార్డ్స్ – టాప్ 100 సోషల్ హీరోస్’:నిర్వి ఆర్ట్స్ ఆధ్వర్యంలో వసుధ ఫౌండేషన్, ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘నిర్వి అవార్డ్స్ – టాప్ 100 సోషల్ హీరోస్’ పేరిట ఒక ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించాయి.నిజమైన హీరోలకు సన్మానం: సమాజంలో వెలుగులోకి రాని ఎందరో నిస్వార్థ సేవకులను గుర్తించి, వివిధ రంగాలలో విశేష సేవలందించిన 100 మంది సోషల్ హీరోలను ఈ వేడుకలో ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు.కళలు, సాహిత్యానికి ప్రోత్సాహం: ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎం. హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో లలిత కళలు, సాహిత్యం, జానపదం, మరియు ప్రాచీన కళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించడానికి త్వరలోనే ‘నిర్వి ఫోక్ అవార్డ్స్’, ‘నిర్వి ఫిలిం అవార్డ్స్’ వంటి సరికొత్త కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజల్లో ఆధ్యాత్మిక భావన.. ధార్మిక గ్రంథాల పంపిణీ:కేవలం సామాజిక, వైద్య, విద్యా రంగాలకే పరిమితం కాకుండా.. సమాజంలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించడానికి హరిప్రసాద్‌రెడ్డి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు.పుస్తకాల పంపిణీ: యువత, విద్యార్థులలో సన్మార్గాన్ని పెంపొందించేందుకు రామాయణం, భాగవతం వంటి ధార్మిక గ్రంథాలతో పాటు, నీతి విలువలను నేర్పే సుమతి శతకం పుస్తకాలను వేలాది మందికి ఉచితంగా పంపిణీ చేశారు.జాతరల్లో అన్నదానం: తన స్వగ్రామమైన చీనేపల్లెలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే చిన్నక్కమ్మ, పెద్దక్కమ్మ జాతర మహోత్సవాలకు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఉచిత అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అటు విదేశాల్లో వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. ఇటు స్వదేశంలో అనాథల ఆకలి తీరుస్తూ, కళలను ప్రోత్సహిస్తూ, ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలిస్తున్న హరిప్రసాద్‌రెడ్డి సేవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలందుకుంటున్నాయి.
సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం
ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం. తాను విదేశాల్లో ఆరు నెలలు ఉంటే మిగిలిన రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తాం. వచ్చే ఆగష్టు మాసంలో తిరుపతిలో ‘నిర్వి అవార్‌ుడ్స–టాప్ 100 సోషల్ హీరోస్’ కార్యక్రమం నిర్వహించాలని భావించడం జరిగింది.
– ఎం. హరిప్రసాద్‌రెడ్డి, ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ సంస్థ అధినేత
ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ‘టాప్ 100 సోషల్ హీరోస్’ పురస్కారం
హైదరాబాద్‌లో ఘనంగా ‘నిర్వి అవార్డ్స్’ వేడుక
వంద మంది సమాజ సేవకులకు సన్మానం
సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక
ప్రచారానికి హరిప్రసాద్‌రెడ్డి పెద్దపీట
త్వరలోనే నిర్వి ఫోక్, ఫిలిం అవార్డ్స్
నిర్వహణకు సన్నాహాలు


