మదనపల్లె టౌన్: పాత కక్షలు మనసులో పెట్టుకుని ఓ యువకుడిపై తన ప్రత్యర్థి దాడి చేసిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కథనం మేరకు.. పట్టణంలోని అమ్మ చెరువు మిట్టలో నివాసం ఉంటున్న జయకుమార్ ను అదే ప్రాంతంలో ఉంటున్న శ్రీనివాసులు మాట్లాడే పని ఉందని పిలిచాడు. పాత కక్షలు మనసులో పెట్టుకొని బండరాళ్లతో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన వ్యక్తిని కుటుంబీకులు స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.
436 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
బద్వేలు అర్బన్ : బద్వేలులో గురువారం విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె మిట్టలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 436 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు నడిపిపోలయ్య అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు.నడిపిపోలయ్యపై బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ శివశంకర్ తదితరులుపాల్గొన్నారు.


