తిరుపతి అర్బన్ : క్రమశిక్షణతోపాటు పట్టుదలతోనే హర్షిత్ ఆల్‌ఇండియా స్థాయిలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో 15వ ర్యాంక్ కై వసం చేసుకున్నారని విశ్వం విద్యాసంస్థల కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్‌రెడ్డి, డైరెక్టర్లు విశ్వచందన్‌రెడ్డి, విశ్వశ్రీ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలోని విశ్వం స్కూల్‌లో హర్షిత్‌తో పాటు విద్యార్థి తల్లి డాక్టర్ గిరిజాను దుశ్శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వం విద్యాసంస్థల్లో చదువుకున్న హర్షిత్ 2019లో సైనిక్ స్కూల్ ప్రవేశంలో రాష్ట్రంలో 3వ ర్యాంక్‌ను సాధించారని చెప్పారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని తాము ఆక్షాంకిస్టున్నట్లు వెల్లడించారు. అలాగే కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు విశ్వనాధ్‌రెడ్డి హర్షిత్‌ను అభినందించారు. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సంబందించి అధనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.


