ముస్లింల రుణం తీర్చుకోలేం | - | Sakshi
Sakshi News home page

ముస్లింల రుణం తీర్చుకోలేం

Mar 15 2026 5:06 AM | Updated on Mar 15 2026 5:06 AM

ఇఫ్తార్‌కు రూ.4.35 లక్షలు

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి

ఇఫ్తార్‌ విందుకు విరాళం అందిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలకు స్వాగతం పలుకుతున్న ముస్లింలు

పుంగనూరు : ముస్లింలకు ఎంత సేవ చేసినా వారి రుణం తీర్చుకోలేమని వైఎస్సార్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు.

శనివారం పట్టణంలోని అంజుమన్‌ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యే, ఎంపీలు ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని 29 మసీదుల్లో ఇఫ్తార్‌ నిర్వహించేందుకు ప్రతి ఏటా ముస్లింలకు పెద్దిరెడ్డి కుటుంబం ఇఫ్తార్‌ విరాళం రూ. 4.35 లక్షలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి ముస్లింలు వెన్నెముకగా నిలిచారన్నారు. తమ కుటుంబానికి తొలినుంచి ముస్లింలు అండగా ఉంటున్నారని తెలిపారు. ముస్లింల అభివృద్ధికి తమ కుటుంబం సేవ చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇక్భాల్‌, ముతవల్లిలు, అంజుమన్‌ కమిటీ అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, జింకావెంకటాచలపతి, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, అమరనాథరెడ్డి, కొత్తపల్లె చెంగారెడ్డి, ముస్లిం పెద్దలు కిజర్‌ఖాన్‌, ఇంతియాజ్‌, నూరుల్లా, ఖాదర్‌, మహబూబ్‌బాషా, ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

బాబు మాటలు నమ్మకండి..

తెలుగుదేశం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు మాటలు నమ్మరాదని పెద్దిరెడ్డి సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయలేదని దుయ్యబట్టారు. ముస్లింలకు ఏనాడు గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. పరిపాలనలో భాగస్వామిగా ఉన్న ఉపముఖ్యమంత్రి ఏమైన పట్టించుకుంటున్నారా అంటూ నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలని నేరవేర్చారని, ముస్లిం మైనార్టీలకు అగ్రస్థానం కల్పించారని పేర్కొన్నారు. జగన్‌కు అండగా ఉండాలని, ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు.

వక్ఫ్‌బోర్డు ఆస్తులను

మనమే కాపాడుకోవాలి:ఎంపీ

రాష్ట్రం, దేశంలో ఉన్న వక్ఫ్‌బోర్డు ఆస్తులను మనమే కాపాడుకోవాలని ఎంపీ మిధున్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఇఫ్తార్‌ విందులో ముస్లింలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు వక్ఫ్‌బోర్డు బిల్లును వ్యతిరేకించామన్నారు. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడుతామన్నారు. ప్రస్తుతం ఇతర సంస్థల ద్వారా ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు ఆస్తులను అన్యాక్రాంతం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement