
రోడ్డు ప్రమాదంలో నైట్ వాచ్‌మన్ మృతి
చిన్నమండెం : మండల పరిధిలోని వండాడి గ్రామం తూర్పుపల్లె దళితవాడకు చెందిన కొండిగారి రామచంద్రయ్య(57) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వండాడి గ్రామ సచివాలయంలో నైట్‌వాచ్‌మన్‌గా పనిచేస్తున్న రామచంద్రయ్య అంగడికి వెళ్తుండగా ద్విచక్రవాహనం రామచంద్రయ్యను ఢీకొంది. వెంటనే క్షతగాత్రుడిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ రామచంద్రయ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఫార్మసీ రంగానిదే ప్రధాన భూమిక
రాజంపేట : నేటి సమాజంలో ఫార్మసీ రంగానిదే ప్రధాన భూమిక అని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి అన్నారు. గురువారం జాతీయ స్థాయి సదస్సులో మొదటి బహుమతి సాధించిన రుక్సానా బేగం, అధ్యాపకురాలు సుష్మితను ఆయన అభినందించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఫార్మసీ రంగంలో రాణిస్తే దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత మాట్లాడారు. కార్యక్రమంలో అన్నమాచార్య ఫార్మసీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
ఏయూ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి