
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలి
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి నీతి అయోగ్ సంస్థ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల వలన విశేష ఫలితాలు సాధించామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగిన సంపూర్ణ అభియాన్ సమ్మాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ పాల్గొన్నారు. నీతి అయోగ్ సూచించిన ఆరు పరిమితుల్లో లక్కిరెడ్డిపల్లి, కోడూరు, కురబలకోట మండలాల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేసి అభివృద్ది సాధించారన్నారు. కురబలకోట మండలం బంగారు పతకాన్ని, కోడూరు మండలం వెండి పతకాన్ని, లక్కిరెడ్డిపల్లి మండలం కాంస్య పతకాన్ని అందుకున్నట్లు జేసీ వెల్లడించారు. అంతకు ముందు కలెక్టరేట్ ఆవరణంలో చేతి వృత్తుల మహిళలు తయారు చేసిన వస్తు ప్రదర్శనల స్టాల్‌ను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ పెద్దయ్య, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ ఐసీడీఎస్ పీడీ హైమావతి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జేసీ ఆదర్శ రాజేంద్రన్