
రాజంపేటలో రెండు బార్లకు నోటిఫికేషన్
రాజంపేట : రాజంపేట ఎకై ్సజ్‌శాఖ పరిధిలో రెండు బార్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో రాయచోటి ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన మాట్లాడుతూ ఆసక్తిగల వారు ఈనెల 26వ తేదీ సాయంత్రం 5గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ 7989216381, ఇన్‌స్పెక్టర్ మల్లిక 9440902595 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన
వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : రాజంపేట చావిడి వీధికి చెందిన సోమిశెట్టి బాలగంగాధర్ బుధవారం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాలగంగాధర్ గత కొంతకాలంగా అప్పులు, అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి వద్ద ఉన్న రెడ్డి అన్నదాన కేంద్రం సమీపంలో విషద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాలగంగాధర్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.