
కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఆటోబోల్తా
● నలుగురికి తీవ్ర గాయాలు
● ఇద్దరి పరిస్థితి విషమం
మదనపల్లె రూరల్ : వివాహానికి వెళుతుండగా, మార్గమధ్యంలో కుక్క అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన నాగలక్ష్మి(45), భార్గవి(25), అంజనమ్మ(45), కల్యాణి(30) నలుగురు కలిసి అదే ప్రాంతానికి చెందిన శ్రీరామకృష్ణ ఆటోలో తంబళ్లపల్లె మండలం ఎర్రగుట్టపల్లెలో పెళ్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో తంబళ్లపల్లె మండలం తిమ్మయ్యగారిపల్లె వద్ద ఆటోకు అడ్డుగా కుక్క రావడంతో, డ్రైవర్ సడెన్‌బ్రేక్ వేయడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నాగలక్ష్మి, భార్గవిలు తీవ్రంగా గాయపడ్డారు. అంజనమ్మ, కల్యాణికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నాగలక్ష్మి, భార్గవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తంబళ్లపల్లె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన నాగలక్ష్మి, భార్గవి

కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఆటోబోల్తా