
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
భూగర్భజలాల పెంపుపై
ప్రత్యేక దృష్టి
రాయచోటి: జిల్లాలో భూగర్భజలాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం అమరావతి నుంచి భూగర్భజలాల పరిణామాల స్థాయిపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, నీటి వినియోగదారుల సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, జల వనరుల సిబ్బందితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటరమణయ్య, సాగునీటి వినియోగదారుల సంఘాల చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలోని మూడు మండలాల్లో భూగర్భజల పరిణామాలు 20 శాతం కన్నా తక్కువగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వీటి పరిమాణస్థాయి పెంపుదలకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి కలెక్టర్ నివేదించారు. రాజంపేట డివిజన్‌లో అధిక వర్షపాతం నమోదు కావడం, అలాగే తిరుమలలో కురిసిన వర్షం ఈ ప్రాంతాలకు చేరుకోవడం వల్ల భూగర్భజలాల పరిణామాల స్థాయి బాగుందన్నారు. మదనపల్లె డివిజన్‌లో యావరేజ్ స్థాయిలో, రాయచోటి డివిజన్‌లో తక్కువగా ఉందన్నారు.