
ప్రజాస్వామ్యబద్ధంగా జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు
ఒంటిమిట్ట(సిద్దవటం): ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని ఒంటిమిట్ట జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్టలో ఆయన మాట్లాడుతూ 13వ తేదీ జరిగిన ఎన్నికలు తీరు బాగాలేదన్నారు.కానీ ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి. పులివెందులలో వైఎస్‌ఆర్‌సీపికీ 683, ఒంటిమిట్టలో 6513 ఓట్లు వచ్చయన్నారు. ఒంటిమిట్టలో 11 గంల వరకు 8వేల ఓట్లు పోలయ్యాయన్నారు. తర్వాత పోలీసు ప్రొటెక్షన్‌తో మంత్రి వచ్చి 10వేల పై చిలుకు రిగ్గింగ్ చేసుకున్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగింటే గెలుపు మాదేనని, టీడీపీవారు ఓటమి చెందేవారన్నారు. మీకు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా, సిటింగ్ జడ్జి చేత ప్రతి గ్రామానికి పోదాం.. ప్రతి ఓటరును పిలుస్తాం.. వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసిఉంటే వేలిమీద సిరాచుక్క ఉండాలన్నారు. ఒంటిమిట్ట, పులివెందులలో చేతిమీద సిరా చుక్క లేకుంటే మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్లు వేసుకున్నట్లే కదా అని అన్నారు. ఈ చాలెంజ్‌కు మంత్రులు, నాయకులుగాని, సంబరాలు చేసుకునేవారు ఎవరైనా సరే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. మా ఏజెట్లను, ఓటర్లను కొట్టి ఓట్లను రిగ్గింగ్ చేసుకున్నారన్నారని ఆయన తెలిపారు. .