
కలలు..కల్లలు
తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటుచేయాలని దశాబ్దాల కాలం నుంచి చేస్తున్న ప్రతిపాదనను రైల్వేబోర్డు తిరస్కరించింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ వంతుగా కృషిచేశారు. కూటమి ఎంపీలు పట్టించుకోలేదు. దీంతో ఉభయ వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రయాణికుల ఆశలు అడియాశలయ్యాయి.
● బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుసాధ్యం కాదని తేల్చిచెప్పిన రైల్వేబోర్డు
● నోరుమెదపని కూటమి పార్టీల ఎంపీలు
● ప్రయాణికుల ఆశలు అడియాసలు..
రాజంపేట: తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ఇక లేనట్టే..ఇది సాధ్యం కాదని రైల్వేబోర్డు తేల్చి చెప్పింది.సౌత్‌కోస్ట్ జోన్ ఏర్పాటుకు హద్దులు తీసుకొచ్చిన రైల్వేబోర్డు తిరుపతి బాలాజీ డివిజన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఈ డివిజన్ ఏర్పాటైతే ఉభయ వైఎస్సార్ జిల్లాలోని రైలుమార్గాలు, రైల్వేలు అభివృద్ధి చెందుతాయని ఇక్కడి వారు ఆశించారు. అయితే రైల్వేబోర్డు వారి ఆశలపై నీళ్లు చల్లింది.కూటమి పార్టీల ఎంపీలు నోరుమెదపకపోవడంపై సీమ వాసుల్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రైల్వేబోర్డు చైర్మన్ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉన్నా ..
రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా జిల్లా వాసి సీఎం రమేష్ ఉండి కూడా తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు విషయంలో ఏమీ చేయలేకపోయారనే విమర్శలున్నాయి. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలను కలుపుతూ ఏర్పాటయ్యే బాలాజీ డివిజన్ విషయంలో సీఎం రమేష్ విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
గుంతకల్ వెళ్లాలంటే దూరాభారం....
తరుచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బ ందులు పడుతున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటుచేసి విశాఖజోన్‌లో కలిపితే బాగుంటుందని రైల్వే నిపుణులు అంటున్నా రు. ఆ దిశగా ఎంపీలు రైల్వేమంత్రిత్వశాఖపై ఒత్తిడి తీసుకురావాలని సీమవాసులు కోరుతున్నారు.
● బాలాజీ డివిజన్ ఏర్పాటైతే తిరుపతి–గూడూరు (92.96కిమీ), తిరుపతి–కాట్పాడి (104.39కిమీ), పాకాల–మదనపల్లె (83కిమీ), రేణిగుంట–కడప (125కిమీ)లైన్ కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. కాగా జిల్లా మీదుగా వెలిగొండ అడవుల్లో నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్‌లోకి వెళ్లింది. అయితే కొత్త డివిజన్‌కు రైల్వేబోర్డు రెడ్‌సిగ్నల్ వేసింది. తిరుపతి ఎంపీ గురుమూర్తికి రైల్వేబోర్డు పంపిన లేఖలో ఈవిషయాన్ని స్పష్టంగా తెలియచేసింది.
బాలాజీ డివిజన్ ఆవశ్యకతను గుర్తించాలి
ప్రజల అవసరాల దష్ట్యా బాలాజీ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వేబోర్డు గుర్తించాల్సిన అవసరం ఉంది. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు బాలాజీ డివిజన్ కీలకం అవుతుంది. రైల్వేబోర్డు సాధ్యంకాదనడం అవివేకమే. రైల్వే యంత్రాంగ పరంగా చూస్తే గుంతకల్ డివిజన్ అనుకూలంకాదని రైల్వేవర్గాలే చెపుతున్నాయి.ఎంపీలు ఈ విషయంలో ఐక్యంగా పోరాడాలి. –భూమనశివశంకర్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్‌సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నందలూరు
రైల్వేబోర్డు పునరాలోచించాలి
రాజ్యసభలో తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ప్రాధాన్యత గురించి తెలియచేశాను. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు కూడా ఈ విషయం గురించి రైల్వేమంత్రిత్వశాఖకు తెలియచేస్తూ వచ్చారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు వల్ల వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోతోపాటు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంతాలకు రైల్వేపరంగా న్యాయం జరుగుతుంది. ఆ దిశగా రైల్వేబోర్డు చైర్మన్ పునరాలోచించాలి. –మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు

కలలు..కల్లలు

కలలు..కల్లలు

కలలు..కల్లలు