జెండా పండుగకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

జెండా పండుగకు సర్వం సిద్ధం

Aug 15 2025 6:48 AM | Updated on Aug 15 2025 6:48 AM

జెండా

జెండా పండుగకు సర్వం సిద్ధం

జెండా పండుగకు సర్వం సిద్ధం

రాయచోటి: జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.

నేటి కార్యక్రమాలు

● ఉదయం 8.50 గంటలకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ రాక, పరేడ్‌ద్వారా ‘‘జనరల్‌ సెల్యూట్‌’’ ప్రదర్శన

● 8.55 గంటలకు కలెక్టర్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ ఆగమనం, పరేడ్‌ ద్వారా ‘‘జనరల్‌ సెల్యూట్‌’’ ప్రదర్శన

● 8.58 గంటలకు ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆగమనం

● 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ

● 9.05 గంటలకు ముఖ్య అతిథి పరేడ్‌ సందర్శన

● 9.15 గంటలకు మంత్రి సందేశం

● 9.45 గంటలకు పోలీసుల కవాతు

● 9.50 గంటలకు స్వాతంత్య్ర సమరయోధుల సన్మాన కార్యక్రమం

● 9.55 గంటలకు డాగ్‌షో

● 10 గంటలకు వివిధ ప్రభుత్వ శకటాల ప్రదర్శన

● 10.30 గంటలకు అగ్నిమాపక శాఖ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు, అగ్నిమాపక శాఖ ప్రదర్శన

● 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, ఎన్‌సీసీ, స్కౌట్స్‌లో పాల్గొనే వారి ఫొటో షూట్‌

● 11.10 గంటలకు ఉద్యోగులకు ఉత్తమ సేవా సర్టిఫికెట్ల ప్రదానం

● 11.55 గంటలకు ముఖ్య అతిథి వివిధ శాఖల స్టాళ్లు సందర్శన, లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ

● 12.05 గంటలకు జాతీయ గీతంతో కార్యక్రమం ముగింపు

జెండా పండుగకు సర్వం సిద్ధం 1
1/1

జెండా పండుగకు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement