
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సి.రాహుల్ చక్రవర్తిరెడ్డిని రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రాయచోటి జగదాంబసెంటర్: 2025–26, 2026–27 అండర్–14, 17 విభాగాల్లో జిల్లా స్కూమ్ గేమ్స్ కార్యదర్శిగా పనిచేయడానికి అర్హత, ఆసక్తి గల స్కూల్ అసిస్టెంట్స్ (ఫిజికల్ ఎడ్యుకేషన్/పీఈటీలు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్‌గా 10 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు అర్హులన్నారు. ఈ నెల 20వ తేదీలోపు రెండు ప్రతులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేర్చాలని డీఈఓ ప్రకటనలో పేర్కొన్నారు.
క్రీడా ప్రతిభా అవార్డుకు..
ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా ప్రతిభా అవార్డు 2025కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కె.సుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తులను డీఈఓ కార్యాలయంల సమర్పించాలని చేర్చాలని కోరారు.
మదనపల్లె: మదనపల్లె స్పెషల్ బ్రాంచ్ ఏఎస్‌ఐ ఉస్మాన్ ఘనీ ఖాన్ నా యబ్ ప్రతిష్టాత్మక విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, విధినిర్వహణలో చిత్తశుద్ధి ప్రదర్శించే పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పతకానికి ఘనీ ఖాన్ ఎంపిక కావడంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు గురువారం ఆయనను అభినందించారు. విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఈ పతకం అన్నమయ్య జిల్లాకు లభించడం గర్వకారణమని కొనియాడారు. 1987లో పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా చేరిన ఘనీ ఖాన్ ఉమ్మడి చిత్తూరుజిల్లాలోని మదనపల్లె ఒకటవ, రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్లు, మొలకలచెరువు, బి.కొత్తకోట, యర్రావారిపాళెం, గుడిపాల, సీఐ విభాగంతోపాటు వివిధ చోట్ల పని చేశారు. ఆయన విధి నిర్వహణలో ఇప్పటిదాక 70 నగదు రివార్డులు, 50 జీఎస్‌ఈలను ఉన్నతాధికారుల నుంచి అందుకున్నారు.
జమ్మలమడుగు: మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి భారీగా నీటిని విడుదల చేశారు. పెన్నానదిలోనికి మైలవరం జలాశయం నుంచి పదివేల క్యూసెక్కుల నీటిని అధికారులు సోమశిల ప్రాజెక్టుకు విడుదల చేశారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ ద్వార 13వేల క్యూసెక్కుల నీరు గండికోట జలాశయంలోనికి వస్తుంది. ప్రస్తుతం గండికోట జలాశయంలో 16టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. అదేవిధంగా మైలవరం జలాశయంలో 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పై నుంచి వస్తున్న నీటిని అధికారులు నేరుగా పెన్నాలోకి విడుదల చేస్తున్నారు.
కలికిరి: డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్–ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 20న వెంకట్రామన్న గూడెంలో యూనివర్సిటీ పరిపాలన కేంద్రంలో స్పాట్ అడ్మిషన్‌లు జరుగుతాయి. ఈ విషయాన్ని కలికిరి హార్టికల్చర్ కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్య లక్ష్మీ తెలిపారు. బాలురకు కలికిరి, నూజివీడు, బాలికలకు రామచంద్రాపురం, మడకశిర కళాశాలలు ఉన్నాయని తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులై, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు కూడా అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 20న వెంకట్రామన్న గూడెంలోని యూనివర్సిటీకి విద్యార్హత, టీసీ, కుల, ఆధాయ ధృవీకరణ, ఆధార్ కార్డులు, ఫొటోలతో హాజరవ్వాలని ఆమె కోరారు.