
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్‌పై వెళుతున్న యువకుడిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం పుంగనూరు నియోజకవర్గం బండ్లపల్లె పంచాయతీ నల్లగుట్టపల్లెలో జరిగింది. పెద్దనల్లూరి పల్లెకు చెందిన అగస్తప్ప కుమారుడు ప్రవీణ్‌కుమార్ (30) వ్యక్తిగత పనుల నిమిత్తం పుంగనూరుకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలోని నల్లగుట్టపల్లె వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్ తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాల్సిందిగా వైద్యులు రెఫర్ చేశారు. అయితే బాధిత కుటుంబం తిరుపతికి వెళ్లలేమని, ఇక్కడే స్థానికంగా వైద్యం అందించాల్సిందిగా విన్నవించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది, తమ వద్ద తలకు చికిత్స అందించేందుకు వైద్యుడు లేడని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని ఆస్పత్రిలోనే పెట్టుకుని ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు.