
మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వీసీగా యువరాజ్
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్(వీసీ)గా ప్రొఫెసర్ యువరాజ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి బుధవారం పేర్కొన్నారు.యూనివర్సిటీ ప్రో చాఽన్స్‌లర్ ఎన్. ద్వారకనాఽథ్ యువరాజ్‌కు నియామక ఉత్తర్వును అందజేశారు.
అడ్మిషన్ల కోసం
అదనపు నోటిఫికేషన్
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో అడ్మిషన్ల కోసం అదనపు నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చిందని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల అర్హత నిర్ధారణ ఈ నెల 21న, లాటరీ ఫలితాల ప్రకటన 25వ తేదీన, పాఠశాలల్లో అడ్మిషన్లు ఖరారు చేయడం ఈ నెల 31న ఉంటుందన్నారు.
రేపు మాంసం విక్రయం నిషేధం
రాజంపేట : రాజంపేటలో ఆగస్టు 15న మాంసం విక్రయాలు, జంతువధఽ నిషేధం అమలులో ఉంటుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్‌ల్లో మాంసం అమ్మరాదన్నారు. ఈ నియమాలు అతిక్రమించిన వారిపై భారీ జరిమానా విధించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
17న బాల్‌బ్యాడ్మింటన్
జట్ల ఎంపిక
రాజంపేట టౌన్ : రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఈనెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లా జట్టుకు బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.కృష్ణమూర్తి, జి.వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో బాల, బాలికలు, సీనియర్స్ విభాగంలో పురుషులు, మహిళల ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు ప్రకాశంజిల్లా చేవూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 9490181104, 7036907303 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
‘పింఛా’లో పెరిగిన నీటిమట్టం
సుండుపల్లె : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పింఛా ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది.బుధవారం సాయంత్రానికి 258 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరగా ప్రస్తుతం 996.6 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో మొత్తం నీరు 81.74 శాతంగా ఉందని జలవనరుల శాఖ ఏఈఈ నాగేంద్రనాయక్ తెలిపారు. ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని, ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తుతారని, అందువల్ల ప్రాజెక్టుకు దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
కౌంటింగ్‌కు పటిష్ట భద్రత
కడప సెవెన్‌రోడ్స్ : పటిష్టమైన భద్రతా బలగాల మధ్య కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వైఎస్సార్ కడపజిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బుధవారం సాయంత్రం కడప రిమ్స్ సమీపంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జేసీ అదితి సింగ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లతో నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులను అత్యంత సురక్షితంగా భద్రపరచామన్నారు. వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే సిబ్బందిని ఏర్పాటు చేసి మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్‌వైజర్లను నియమించి కౌంటింగ్ పై వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. రౌండ్ల వారీగా కౌంటింగ్ సమాచారం కోసం మీడియా సెంటర్‌ను కుడా ఏర్పాటు చేశామన్నారు.

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వీసీగా యువరాజ్