
కాటమరాజు స్థల పట్టాను రద్దు చేయండి
గాలివీడు : కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామ ప్రజలందరూ సంక్రాంతి రోజున కాటమరాజు దగ్గర చిట్లాకుప్ప వేసుకొని పశువులను బెదిరిస్తూ పండగ చేసుకుంటూ వస్తున్నారని, ఈ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తి పట్టా చేసుకొని చుట్టూ కంచె వేశాడని, ఈ స్థలానికి సంబంధించి డీకేటీ పట్టాను రద్దుచేసి గ్రామ ప్రయోజనాల కోసం కాటమరాజు ఉత్సవానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తహసీల్దార్ భాగ్యలతకు సూచించారు. నూలివీడు పంచాయతీ నాగూరివాండ్లపల్లెకు సమీపంలో ఉన్న స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తి డీకేటీ పట్టా చేయించుకుని దాని చుట్టూ కంచె వేసిన విషయాన్ని గ్రామ ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్‌తో కలిసి కలెక్టర్ కాటంరాజు స్థలాన్ని పరిశీలించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాటమరాజు స్థలాన్ని ఆక్రమించుకున్న కుటుంబ సభ్యులకు ఎన్ని ఎకరాల వరకు డీకేటీ పట్టా ఉంది.. ఎంతమంది పేర్ల మీద డీకేటీ ఉంది అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. వెంటనే కాటమరాజు స్థలాన్ని ఆక్రమించుకొన్న డీకేటీ పట్టాను రద్దు చేయడానికి తగిన ప్రతిపాదనలు తమకు పంపాలని తహసీల్దార్‌కు తెలియజేశారు. గుడి స్థలాలను కబ్జా చేసేవారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.కాటమరాజు స్థల వివాదం విషయం తమ దృష్టికి వచ్చిందని. ఇరుపక్షాలతో మాట్లాడి కాటంరాజు ఉత్సవాన్ని జరుపుకోవడానికి స్థలం ఇవ్వాలని తాను కూడా వారికి తెలియజేసినట్లు తహసీల్దార్ భాగ్యలత కలెక్టర్‌కు విన్నవించారు.
ఆధునిక బోధనా పద్ధతులు తప్పనిసరి
రాయచోటి : అంగన్‌వాడీ సెంటర్లలో ఈసీసీ కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఆధునిక బోధనా పద్ధతులు అనుసరించడం అవసరమని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి అంగన్‌వాడీ సెంటర్లలో ఈసీసీ కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్‌తోపాటు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ హైమావతి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు ఆధునిక బోధనా పద్ధతులు అనుసరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని,వారిభవిష్యత్తుకు ఇది బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు.
జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలోని 2275 అంగన్ వాడీ కేంద్రాల్లో 35248 మంది పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యను అందిస్తున్నామని వివరించారు. తంబళ్లపల్లిలో అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి మూవబుల్ గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి