
వైఎస్ జగన్‌ను కలిసిన సుబ్బారెడ్డి
ఒంటిమిట్ట : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని బుధవారం జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి ఆయనతో చర్చించారు. ఇంతటి ఘోరమైన ఎన్నికలు తమ జీవితంలో చూడలేదన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన ప్రతి బూత్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమక్షంలో ఆయన మనుషులు రిగ్గింగ్ చేశారని తెలిపారు. ఇక్కడ జరిగిన దౌర్జన్యాలు, అక్రమాల గురించి మాజీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట వైఎస్సార్ సిప మండల అధ్యక్షులు టక్కోలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.