
ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థనలు
పీలేరు రూరల్ : అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ సోమవారం పీలేరు నియోజకవర్గంలోని ముస్లింలు కర్ణాటకలో ప్రసిద్ధ మురగముల్లా అమ్మాజాన్ బావాజాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఎంపీని అరెస్ట్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డాక్టర్ హబీబ్‌బాషా, మైనారిటీ నాయకులు అబ్దుల్ కలీమ్, కలకడ కరీముల్లా, ఎస్. అబీద్, అత్తార్ కాలేషా, షాజహాన్, ఖాదర్‌బాషా, అమీన్‌పీర్, సమీ, జాకీర్, ఇమ్రాన్, అలీఅన్సర్ తదితరులు పాల్గొన్నారు.