
అతి వేగం.. ఆపై సెల్‌ఫోన్ మాట్లాడుతూ..
లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
యువకుడికి తీవ్ర గాయాలు
పుల్లంపేట : ఓ చేత్తో బైకు రైడింగ్.. మరో చేత్తో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వేగంగా వెళ్లి నిలిచి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో కడప–రేణిగుంట జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన పోలిచెర్ల సునీత, శ్రీను దంపతుల కుమారుడు పోలిచెర్ల వినయ్ సోమవారం మధ్యాహ్నం రాజంపేట నుంచి ద్విచక్ర వాహనంపై అధిక వేగంతో సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లాడు. మోడల్ స్కూల్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నిలబడి ఉన్న లారీని వెనుకవైపు నుంచి ఢీ కొట్టాడు. దీంతో వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రాజంపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
యువకుడికి తీవ్ర గాయాలు