
రెండు బైకులు ఢీ
ఓబులవారిపల్లె : మంగంపేట జాతీయ రహదారి డాబా హోటల్ వద్ద సోమవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలివాండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ పల్సర్ బైక్‌పై రైల్వేకోడూరు నుంచి వస్తుండగా మంగంపేట గ్రామం నుంచి బైకుపై ఎం.బాబు కోడూరు వైపు వెళ్తుండగా ఎదురెదురుగా ఢీ కొన్నారు. ప్రమాదంలో ఇద్దరికీ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీఎండీసీ అంబులెన్సులో రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు