
అదుపు తప్పి లోయలో పడిన సిమెంట్ లారీ
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్‌లోని రెండవ మలుపు వద్ద సిమెంట్ లారీ సోమవారం అదుపు తప్పి లోయలో పడిపోయింది. రామాపురం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు చెందిన లారీ డ్రైవర్ ధనుంజయ ఎర్రగుంట్ల నుంచి బెంగళూరుకు ఎన్‌ఎల్ 01 ఎల్ 1786 నంబర్ గల లారీలో సిమెంట్ తీసుకువెళ్తుండగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. స్థానికుల సాయంతో పోలీసులు డ్రైవర్‌ను బయటకు తీసి రక్షించారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.