
గంగమ్మా..కరుణించమ్మా
లక్కిరెడ్డిపల్లె: గంగమ్మ దేవతా కరుణించి కాపాడు తల్లీ అంటూ మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీ అనంతపురం గంగమ్మ దేవతకు భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పించారు. మొక్కులు ఉన్న భక్తులు అమ్మవారికి బోణాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెన్నా పరవళ్లు
సిద్దవటం: మండల కేంద్రమైన సిద్దవటంలోని పెన్నానది ఆదివారం తెల్లవారు జాము నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో, రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరింది.పెన్నానది లోలెవల్ కాజ్‌వే పైకి ఎవరినీ వెళ్లనీయకుండా సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ కాజ్‌వేకి ఇరువైపులా ముళ్లకంపతో కంచె వేయించారు.నదిలో సుడిగుండాలు ఉన్నాయని, కొత్తవ్యక్తులు, స్థానికులు ఎవరూ నదిలోకి దిగవద్దని ఎస్‌ఐ తెలియజేశారు.
హార్సిలీహిల్స్ నిర్మానుష్యం
బి.కొత్తకోట: మారిన వాతావరణ పరిస్థితులతో మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ నిర్మాణుష్యంగా మారింది. ఆదివారం సందర్శకుల సందడితో కొండపై ఆహ్లదకరమైన పరిస్థితులు కనిపిస్తాయి. అయితే చల్లటిగాలులతో చలి పెరగడం, ముసురుపట్టి వర్షాలు కురుస్తుండటంతో పర్యాటకుల రాక ఆగిపోయింది. దీనితో కొండపై ఎక్కడచూసిన జన సంచారం లేక నిర్మానుష్యంగా మారింది.
జగన్‌మోహన్ రాజుపై
దాడికి యత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్: మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని హరిత రెస్టారెంట్లో టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజుపై సొంత పార్టీ కార్యకర్తలే దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళితే ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో బూత్‌లకు సంబంధించి కొత్త వారిని నియమించడంతో ఒంటిమిట్ట తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహావేశాలు తారస్థాయికి చేరాయి.. ఇది వరకు ఇన్‌చార్జీలుగా పని చేసిన తెలుగు తమ్ములంతా ఆదివారం స్థానిక హరిత రెస్టారెంట్‌లో చమర్తిపై తిరగబడ్డారు. ఈ విషయంలో ఒంటిమిట్టకు చెందిన ఓ యువకుడు చమర్తి జగన్‌మోహన్‌రాజుపై దాడికి యత్నించడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఇది రాజ్యాంగబద్దంగా ఇచ్చిన హక్కని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పులివెందుల మండలం మోట్నూతలపల్లె గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ ఎన్నిక చాలా చిన్నదని, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కొడుకు హేమంత్‌రెడ్డిని జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బరిలోకి దించిందన్నారు. సాధారణంగా ఈ ఎన్నికను సానుభూతికి వదిలేస్తారన్నారు. కానీ, ఆదినారాయణరెడ్డి లాంటి జిమ్మిక్కులు చేసే వ్యక్తులకు తోడు చంద్రబాబు, లోకేష్ ఇక్కడ ఎన్నికకు పోటీకి వచ్చారన్నారు. పోటీ చేయడం వరకు తప్పేమి లేదు గానీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేయడం, ఆర్థికంగా ప్రలోభాలతో మభ్యపెట్టడం దారుణమన్నారు.

గంగమ్మా..కరుణించమ్మా

గంగమ్మా..కరుణించమ్మా