వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం

Aug 11 2025 6:38 AM | Updated on Aug 11 2025 6:38 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం

ఒంటిమిట్ట(రాజంపేట): జెడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచార చివరిరోజు ఆదివారం ఒంటిమిట్టలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కూటమి కుట్రలను తిప్పికొట్టేలా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా కొనసాగిన ర్యాలీకి విశేషస్పందన లభించింది. ఒంటిమిట్ట వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం తథ్యమని ధీమాను వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అడ్డా అన్నారు. ఎంతమంది ఎన్నికుట్రలు పన్నినా, కేబినెట్‌ కదిలివచ్చినా చేసేదేమి ఉండదని, ఓటమి చవిచూడటం తప్ప అన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో కూటమి కుట్రలను ఒంటిమిట్ట వాసులే ఓటు అనే ఆయుధంతో తిప్పికొడతారన్నారు. ఎన్నికలకోడ్‌ ఉల్లంఘన యథేచ్ఛగా ఒంటిమిట్టలో కొనసాగిందని ఉన్నతాధికారులకు తెలిసినా అడ్డుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలే అండగా నిలుస్తున్నారన్నారు. ర్యాలీతో వైఎస్సార్‌సీపీ క్యాడర్‌లో నూతనోత్సహం వెల్లివిరిసింది. పాజిటివ్‌ ధృక్పథంతో ముందుకుసాగారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటువే యాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆశీర్వదించాలని మండల ఓటర్లను అభ్యర్థిచారు.

● ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పార్లమెంట్‌ పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, కొరముట్ల శ్రీనువాసులు, రఘురామిరెడ్డి, కడప జెడ్పీచైర్మన్‌ రామగోవిందరెడ్డి, స్ధానిక సీనియర్‌ నేత ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, ,రాజంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి,కడప డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధానకార్యదర్శి ఏకులరాజేశ్వరిరెడ్డి, ఒంటిమిట్ట మండల కన్వీనరు టక్కోలు శివారెడ్డి, పుల్లంపేట ఎంపీపీ ముద్దాబాబుల్‌రెడ్డి, రైల్వేకోడూరు వైస్‌ ఎంపీపీ ధ్వజారెడ్డి, రాయలసీమ వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, దళితనేత పులిసునీల్‌కుమార్‌, వడెర సంఘం రాష్ట్రనేత వడ్డెరమణ,గల్ఫ్‌ వైఎస్సార్‌సీపీ కన్వీనరు ఇలియాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒంటిమిట్టలో భారీ ప్రచార ర్యాలీ

ఫ్యాన్‌ గుర్తుకే ఓటువేయాలని నేతల అభ్యర్థన

వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం 1
1/1

వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement