
ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం
చిన్నమండెం : ట్రాక్టర్ ఒరగడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మజ్‌హీసింగ్(23), గలగసింగ్(20), లక్ష్మణ్‌సింగ్‌లు చిన్నమండెం–పెద్దమండ్యం జాతీయ రహదారిలో హైవోల్టేజీ విద్యుత్ లైన్ పనులు చేస్తున్నారు. పనులు ముగించుకొని ట్రాక్టర్‌లో చిన్నమండెంకు వస్తుండగా పడమటికోన గ్రామం తొగటపల్లె సమీపంలో ట్రాక్టర్ పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో మజ్‌హీసింగ్(23), గలగసింగ్(20) అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్‌సింగ్‌కు గాయాలయ్యాయి. మృతదేహాలను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
సిద్దవటం : కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలం భాకరాపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన పడిఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని కడప రిమ్స్‌లో చేర్పించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఆమె వివరాలు తెలిసిన వారు ఒంటిమిట్ట సీఐ బాబు, 9121100581, సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ 9121100584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ప్రమాదంలో గాయపడి.. కోలుకోలేక..
ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాలు... స్థానిక మండల కేంద్రం ఇందిరా కాలనీకి చెందిన వెంకటరమణ, భార్య శాంతమ్మలు కలిసి గత గురువారం ద్విచక్రవాహనంలో పనుల మీద మదనపల్లెకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో వేపూరికోట వద్ద శాంతమ్మ చీర బైక్ చక్రానికి చుట్టుకొని కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మత్తుకు బానిసలు కావద్దు
రాయచోటి టౌన్ : మత్తుకు బానిసలై జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దని అన్నమయ్య జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ అధికారి జి. మధుసూదన్ అన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ వద్ద కార్మికులతో ఆయన మాట్లాడారు. రోజంతా కష్టపడి పని చేసి వచ్చిన డబ్బులను మద్యం, ఇతర మత్తు పదార్థాల కోసం ఖర్చు పెడితే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవడమే గాక జీవితం కూడా చిన్నాభిన్నమవుతుందన్నారు. మావనత సంస్థ సభ్యుడు సహదేవ రెడ్డి మాట్లాడుతూ మత్తుకు దూరంగా ఉండి మీ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, డైట్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి, ఎకై ్సజ్ సీఐ గురుప్రసాద్, ఎస్‌ఐ ఓ. హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం

ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం

ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం

ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం