
కడప– బద్వేలు మార్గంలో కూలిన వంతెన
సిద్దవటం : కడప– బద్వేలు మార్గంలోని అటవీ ప్రాంతంలో సాహెబ్ బావి రహదారికి సమీపంలో కిటికీల వంతెన శనివారం కూలిపోయంది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి. ఈ రహదారి గుండా నెల్లూరు, బద్వేలు కలువాయి, పోరుమామిళ్ల తదితర ప్రాంతాలకు ప్రయాణికులు వెళుతుంటారు. 1983లో ఈ వంతెన నిర్మించారు. శనివారం అధిక లోడుతో వాహనాలు ప్రయాణించడంతో వంతెన కూలిపోయిందని ద్విచక్ర వాహనదారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపి ప్రయాణికులు ఎవరినీ రోడ్డు దాటనీయకుండా చర్యలు చేపట్టారు. అధికారులు రెండు జేసీబీ యంత్రాలతో వంతెన పక్కనే అప్రోచ్ రోడ్డుకు చర్యలు చేపట్టారు. ఈ పనులను బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ పరిశీలించారు. అనంతరం సాయంత్రానికి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.

కడప– బద్వేలు మార్గంలో కూలిన వంతెన