
తెగిన పోగులు.. మారని బతుకులు
మదనపల్లె సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేతన్నల సమస్యలు గాలికి వదిలేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. తొమ్మిది నెలల క్రితం జీఓ జారీ చేసి ఏడాది తరువాత ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అది కూడా పలు కొర్రీలు పెట్టారు. దీంతో చాలా మంది లబ్దిదారులు ఈ పథకంకు దూరంకానున్నారు. దీనిపై నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి సర్కారు చిన్నచూపు
కూటమి సర్కారు చేనేతలను చిన్నచూపు చేస్తోంది. కార్మికులను ఎంతగానో ఆదుకున్న నేతన్న నేస్తం పథకానికి మంగళం పాడింది. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో చేనేతలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో చాలా మంది కార్మికులు రేషం, వార్పు ధరలు తగ్గే వరకు మగ్గాలు నిర్వహించకుండా అపేస్తున్నారు. మరికొందరు రేయింబవళ్లు మగ్గం నేస్తూ తక్కువ కూలీతో బతుకు వెళ్లదీస్తున్నారు. ఇంతటి దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
కుదేలైన చేనేత రంగం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగం కుదేలైంది. పట్టుచీరల తయారీలో వినియోగించే ముడి పట్టుధర ఆకాశన్నంటుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో కిలో రూ4,800 ఉండగా ప్రస్తుతం రూ.5,800 పలుకుతోంది. వార్పు ధరలు ఆరు నెలలుగా పెరుగుతుండటంతో తయారీదారులపై భారం పడుతోంది. ముడిపట్టు ధరకు అనుగుణంగా చీరల ధరలు పెరగకపోవడంతో తయారీదారులపై భారం పడుతోంది. జిల్లాలో చేనేతరంగంపై 18 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తుండగా సుమారు 35 వేల మంది కార్మికులు, అనుబంధరంగాల వారు ఆధారపడి జీవిస్తున్నారు. అందులో మదనపల్లె(నీరుగట్టువారిపల్లె)లో 12 వేల కుటుంబాలు ఉన్నాయి. అలాగే కలకడ, తంబళ్లపల్లె, నిమ్మనపల్లె, వాల్మీకిపురం, కురబలకోట,బి.కొత్తకోట, పుల్లంపేట, చిన్నమండ్యం, గాలివీడు, సంబేపల్లి, రాజంపేట, వీరబల్లి మండలాల్లో చేనేతకుటుంబాలు ఉన్నాయి.
నేతన్న నేస్తంతో పరిస్థితి మెరుగ్గా
ముడిపట్టు ధరలు పెరగడం, తగ్గడం సహజంగా జరుగుతోంటుంది. ఈ ఒడిదుడుకులను తట్టుకునేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ముడి పట్టురాయితీ ఒకేసారి బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆదుకునేవారు. ఇలా ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా సాయం అందించారు. కరోనా వంటి కష్టకాలంలో రెండు నెలలు ముందుగానే నేతన్న నేస్తం నిధులు కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. ఫలితంగా చేనేత కార్మికులు ప్రభుత్వం అందించిన సాయంతో చేనేత మగ్గాలను ఆధునీకరించుకుని గతంలో కంటే మెరుగైన డిజైన్‌లను వేసుకుని ఎక్కువ లాభం సంపాదించి అభివృద్ధి చెందారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో నేతన్న నేస్తం వివరాలు
సంవత్సరం లబ్ధిదారులు నిధులు
సబ్సిడీ అందజేయాలి
మగ్గం కలిగిన ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ హామీ త్వరగా అమలు చేయాలి. ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉంది. పట్టు పరిశ్రమలో వార్పు, జరీ కొనుగోలుకు సబ్బిడీ అందజేయాలి. –బాలచంద్ర,
చేనేత కార్మికుడు, నీరుగట్టువారిపల్లె. మదనపల్లె
హామీలు అమలు చేయాలి
చేనేతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎన్నికల్లో చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీలు ఇప్పటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి. చేనేతలను అన్ని విధాల ఆదుకోవాలి. –నిస్సార్‌అహ్మద్,
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త
అర్హులకు ఉచిత విద్యుత్ పథకం అందించాలి
కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత విద్యుత్ పథకం అర్హులందరికి అందించాలి. మగ్గం ఉన్న వారితో పాటు చేనేత అనుబంధరంగాలైన వైడింగ్, రాట్నం చుట్టడం, రంగులు, అచ్చులు అద్దకం వంటిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి కూడా ఈ పథక అమలయ్యేలా చూడాలి. లబ్దిదారులను తగ్గించాలన్న సాకుతో కొర్రీలు పెడుతున్నారు. –శీలం రమేష్, వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు
నేతన్నల డిమాండ్లు ఇవీ
పట్టుచీరలకు మద్దతు ధర కరువు
ఉచిత విద్యుత్ హామీలోనూ కోతలే
ఆదుకోని కూటమి సర్కారు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనేతన్ననేస్తంతో ఊరట
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం అమలు చేయాలి.
మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తింపజేయాలి.
చేనేత వస్త్ర ఉత్పత్తులకు జీఎస్టీ ఎత్తి వేయాలి.
కాటన్, సిల్క్ జరీలపై 50 శాతం రాయితీ ఇవ్వాలి, చేనేత కార్మికులకు 45 సంవత్సరాలకే పింఛన్ మూంజూరు చేయాలి.
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి సంఘాలను బలోపేతం చేయాలి.
ఆత్మహత్మలు చేసుకున్న చేనేత కార్మికులకు రూ.7లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
2021 5837 రూ.14,00,88,000
2022 6118 రూ.14,68,32,000
2023 6937 రూ.16,64,88,000

తెగిన పోగులు.. మారని బతుకులు

తెగిన పోగులు.. మారని బతుకులు

తెగిన పోగులు.. మారని బతుకులు

తెగిన పోగులు.. మారని బతుకులు

తెగిన పోగులు.. మారని బతుకులు