
పింఛా ప్రాజెక్టుకు వరదనీరు
సుండుపల్లె: ఇటీవల కురిసిన వర్షాలతో పింఛా ప్రాజెక్టులోకి వరదనీరు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం వెయ్యి అడుగులు ఉండగా శనివారం ఉదయానికి 993.90 అడుగులు నీటి నిల్వ ఉందని జలవనరుల శాఖ ఏఈఈ నాగేంద్రనాయక్ తెలిపారు. ఎడమ కాలువ ద్వారా ఒక క్యూసెక్కు, కుడికాలువ ద్వారా 6 క్యూసెక్కుల నీరు వ్యవ సాయ పొలాలకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్స్ వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని జెడ్పీ సీఈఓ, రిటర్నింగ్ అధికారి ఓబులమ్మ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ప్రిసైడింగ్ అధికారులకు, ఏపీఓలకు బ్యాలెట్ బాక్స్ ల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వి.విజయలక్ష్మి, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.
నూలివీడులో
వెలుగుచూసిన శాసనం
కడప సెవెన్‌రోడ్స్: గాలివీడు మండలం నూలివీడులో అరుదైన శాసనం వెలుగు చూసినట్లు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ (ఏపిగ్రఫీ) మునిరత్నంరెడ్డి శనివారం ఒక ప్రకట నలో తెలిపారు. ఒక పాఠశాల ఉపాధ్యాయుని సమాచారం మేరకు నూలివీడు గ్రామ సమీపాన ఉన్న ఓ పెద్ద రాతి గుండుకు ఈ శాసనం మలిచారని తెలిపారు. విజయనగర కాలం నాటి శాసనంగా గుర్తించామని పేర్కొన్నారు. శాసనాలలో ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని వివరించారు.

పింఛా ప్రాజెక్టుకు వరదనీరు

పింఛా ప్రాజెక్టుకు వరదనీరు