ఖరీఫ్‌.. ఖతం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌.. ఖతం

Aug 9 2025 5:05 AM | Updated on Aug 9 2025 5:05 AM

ఖరీఫ్

ఖరీఫ్‌.. ఖతం

వ్యవసాయశాఖ చరిత్రలో దారుణమైన పరిస్థితి

62,178 హెక్టార్లకు సాగైంది కేవలం 5,655 హెక్టార్లలోనే

ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎరుగని రైతాంగం

కూటమి ప్రభుత్వం వచ్చాకరెండో ఏడాది కుదేలైన వ్యవసాయం

ఏటా తగ్గుతున్న ఖరీఫ్‌ సాగు

సంవత్సరం సాగు కావాల్సింది బీళ్లు:

(హెక్టార్లలో) (హెక్టార్లలో)

2022 86,795 56,062

2023 82,589 61,297

2024 65,386 40,990

2025 62,178 56,523

మదనపల్లె: జిల్లా ఖరీఫ్‌ వ్యవసాయ చరిత్రలో ఎరుగని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంటల దిగుబడిపై ప్రభావం చూపడం జరిగేది. మొదటిసారి రైతులు పంటనే సాగు చేయలేని దయనీయమైన పరిస్థితి మొదటిసారి కనిపిస్తోంది. వెంటాడుతున్న వర్షాభావం, చినుకు కరువు కావడం, పంటలు పెట్టలేని పరిస్థితికి దారితీసినప్పటికి ఊహకందని విధంగా సాగు విస్తీర్ణంలో 90.08 శాతం భూములు బీళ్లుగా మారడాన్ని రైతాంగం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే పెట్టిన 9.92 శాతం పంటలు కూడా చేతికందే పరిస్థితి లేదు. వ్యవసాయంపై పెట్టుబడు పెట్టి పంటలు సాగు చేసే రైతాంగం తీవ్రస్థాయిలో నష్టపోతోంది. ఇప్పటి పరిస్థితులు ఇంకెంత కాలం వెంటాడుతాయో అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది.

దారుణమైన సాగు

ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగు విషయంలో వ్యవసాయశాఖ జిల్లా వ్యాప్తంగా 62,178 హెక్టార్లలో 32 రకాల పంటలు సాగవుతాయని ప్రణాళిక అమలు చేసింది. నిర్ణయించిన సాగు విస్తీర్ణంలో అన్ని పంటలు సాగవ్వాలి. అయితే ఆగస్టు నాలుగో తేదీనాటి లెక్క ప్రకారం సాగైన పంటలు పది మాత్రమే. ఇందులోనూ అతి తక్కువ విస్తీర్ణం. సాగు ప్రణాళికలో ప్రధానమైన పంట వేరుశేనగ, రైతులు ఈ పంటపైనే అత్యధికంగా ఆధారపడి సాగు చేస్తారు. పంట పూర్తయ్యాక ధర పలుకుతుందని ఆశలు పెట్టుకుంటారు. ఇలాంటి పంట జిల్లాలో 40,639 హెక్టార్ల సాగు అవుతుందని భావించి దానికి తగ్గట్టుగా రాయితీ వేరుశనగ విత్తన కాయలను పంపీణీ చేశారు. అయితే ఈనెల నాలుగు నాటికి 2,870 హెక్టార్లలోనే విత్తనం పడింది. ఈ పంట కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు.

వెంటాడుతున్న వర్షాభావం

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. గత ఖరీఫ్‌లో వర్షాభావం కారణంగా సాగు చేసిన పంటలు చేతికందలేదు. పెట్టిన పెట్టుబడి కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం 19 మండలాల్లో కరువు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. పంట నష్టాలపై నివేదికలు వెళ్లినా ఇప్పటిదాకా పైసా పరిహారం చెల్లించలేదు. ఇదే పరిస్థితి ప్రస్తుత ఖరీఫ్‌లో పునరావృతమైంది. జూన్‌ నుంచే వర్షాలు ఆశించిన మేరకు కురవలేదు. వాతావరణంలో మార్పులు కనిపించడంతో పంటలు బాగా పండుతాయని ఆశించిన రైతాంగానికి ఖరీఫ్‌ ప్రారంభంలోనే నిరాశ మిగిలింది. జూన్‌లో తీవ్ర వర్షపాత లోటు ఉండగా అది జూలై నెలలోనూ కొనసాగింది. దీంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. జూలైలో ఒక్క మండలంలోనూ అధిక వర్షం కురవలేదు. నాలుగు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదవగా, 20 మండలాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చాకా వరుసగా రెండో ఏడాది దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయంరంగం కదేలైంది.

వర్షపాత వివరాలు (మి.మీ)

నెల కురవాల్సింది కురిసింది లోటు

జూన్‌ 75.1 17.9 76.2

జూలై 90.5 73.7 18.2

ఆగస్టు 99.8 – 100.0

సాగు చేయలేక..

15 ఎకరాల పోలం ఉన్నప్పటికి ఖరీఫ్‌లో పంటలు సాగుచేయలేక బీళ్లుగా వదిలేశాను. గత ఖరీఫ్‌లో సాగు చేసి పెట్టుబడి కూడా చేతికందలేదు. ప్రస్తుతం వర్షాలు లేవు.పంటలను సాగు చేసిన తిరిగి పెట్టుబడి దకకుతుందన్న నమ్మకం లేదు.

–గోపాల్‌రెడ్డి, కురబలకోట

ఆరెకరాలు బీడు

ఆర్‌ఎన్‌తాండాలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నిరుడు ఈ భూమిలో వేరుశనగ సాగు చేస్తే పెట్టుబడి మొత్తం నష్టపోయాను. పైసా దక్కలేదు. ప్రస్తుతం వేరుశనగ సాగు చేసేందుకు పెట్టుబడి, విత్తనం సిద్ధం చేసుకున్నప్పటికి వర్షం లేదు. ఫలితంగా విత్తనకాయలను విక్రయించక తప్పదు. వర్షాభావంతో పంటల సాగుచేయలేక ఇబ్బంది పడుతున్నాం.

–కష్ణా నాయక్‌, ఆర్‌ఎన్‌తాండ, తంబళ్లపల్లె

ఖరీఫ్‌.. ఖతం 1
1/4

ఖరీఫ్‌.. ఖతం

ఖరీఫ్‌.. ఖతం 2
2/4

ఖరీఫ్‌.. ఖతం

ఖరీఫ్‌.. ఖతం 3
3/4

ఖరీఫ్‌.. ఖతం

ఖరీఫ్‌.. ఖతం 4
4/4

ఖరీఫ్‌.. ఖతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement