
ఆర్టీసీ పెట్రోల్ బంకులో గోల్‌మాల్
రాజంపేట : రాజంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలోని పెట్రోల్ బంకులో భారీ గోల్‌మాల్ వెలుగుచూసింది. కొందరు సిబ్బంది తమ వ్యక్తిగత ఫోన్‌పే క్యూ ఆర్ కోడ్లు పెట్టుకుని నగదు మళ్లించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులు కాస్త పోలీసులకు ఫిర్యాదు చేయడంలో అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై బస్టాండు పరిసర ప్రాంతాల్లో విచారించగా కొద్ది రోజులుగా ఈ పెట్రోలు బంకులో ఫోన్‌పేను నిషేధించినట్లు అక్రమాలే కారణమని స్థానికులు తెలిపారు. గత డిసెంబరు నుంచి ఇప్పటి వరకూ బంకుకు ఫోన్‌పే ద్వారా జమ చేసిన మొత్తం రూ.40 లక్షలు కొందరి వ్యక్తిగత ఖాతాలో జమైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
క్యూఆర్ కోడ్‌తో రూ.40 లక్షలు స్వాహా