
అక్రమ మద్యం పట్టివేత
ఒంటిమిట్ట : మండలంలోని కొండమాచుపల్లి–బాపనపల్లి మార్గంలో మదు శ్రీనివాసరెడ్డి(46)ఎనిమిది మద్యం బాటిళ్లను తీసుకెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గాలివాన బీభత్సం
కలకడ : కలకడ మండలంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కలకడ, కె.బాటవారిపల్లె, బాలయ్యగారిపల్లెలో చెట్లు నేలకూలాయి. రేకులషెడ్లు కూలిపోయాయి. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం సాయంతంర వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. గాలివాన వల్ల మండలవ్యాప్తంగా టమాట పంటలు దెబ్బతిన్నాయి.
ఉత్సాహంగా క్రీడల పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : 2025 జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం క్రీడల పోటీలు ఉత్సాహంగా సాగాయి. నగరంలోని క్రీడా పాఠశాలలో అర్చరీ, హాకీ, వెయిట్ లిప్టింగ్ పోటీలలో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు, డీఎస్‌ఎ క్రీడా మైదానంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించగా క్రీడాకారులు ప్రతిభ చూపారు. ప్రతిభ చూపిన వారిని జట్టుగా ఏర్పాటుచేస్తామని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 11న తిరుపతిలో నిర్వహించే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.
గాలిబండపై బైకర్లకు చెక్
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్‌లోని గాలిబండపై బైకర్ల హంగామాకు చెక్ పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బైకర్లు గాలిబండపై విన్యాసాలు చేస్తూ కిందకు వెళ్తుంటారు. ఇది చాలా ప్రమాదకమైనది కావడంతో పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా హంగామా ఆగకపోవడంతో మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఎస్పీ మహేంద్ర గాలిబండను పరిశీలించారు. బైక్‌లు వెళ్లే మార్గంలో ఇనుప కమ్మీలతో ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. సీఐ జీవన్ గంగనాధ్‌బాబు శుక్రవారం దీనిని పరిశీలించి బందోబస్తుగా సిబ్బందిని ఏర్పాటుచేశారు. దీంతో ఇకపై బైకర్లు గాలిబండపైకి వెళ్లకుండా చెక్ పడింది.

అక్రమ మద్యం పట్టివేత