
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మండలంలోని నారాయణరెడ్డిపల్లె గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని 104 వాహనంలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తున్న బాలక్రిష్ణంరాజు నారాయరెడ్డిపల్లె సచివాలయం నుంచి ద్విచక్ర వాహనంలో రాయచోటికి వెళ్తున్నారు. తిరుపతి నుంచి రాయచోటికి మరో వాహనంలో నాగార్జు న, బిందు దంపతులు వస్తున్నారు. రెండు వాహనాలు అదుపు తప్పడంతో ముగ్గురు కిందపడి గాయాలపాలయ్యారు. 108 సహయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వేర్వేరు ప్రమాదాల్లో
మరో ముగ్గురికి
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కపలకోట మండలం అంగళ్లకు చెందిన అక్బర్‌సాబ్ కుమారుడు ముస్తఫా(48) తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంలో కర్ణాటకలోని మురుగుముళ్ల దర్గాకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని రాయల్పాడు సమీపంలో వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన మురారి(20), అతని స్నేహితుడు పురుషోత్తం(18) కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. పల్లె క్లాసు వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.
యువకుడి బొటనవేలు
కొరికేసిన కానిస్టేబుల్
వీరబల్లి : భూ తగాదా విషయంలో యువకుడి బొటనవేలు కానిస్టేబుల్ కొరికేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. వీరబల్లి మండలం ఈడిగపల్లిలో నివాసముంటున్న వీరబల్లి దయానందం కుమారుడు వేంకటేశ్వర్లు ప్రస్తుతం విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరబల్లి శివకుమార్ కుమారుడు వినోద్ కుమార్‌తో వీరికి భూమి తగాదా ఉంది. శుక్రవారం ఈ విషయపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో వినోద్‌కుమార్ బొటనవేలును వేంకటేశ్వర్లు కొరికేయగా, అతడి కుమారుడు వినయ్ వినోద్ కుమార్ కారును పగులగొట్టారు. ఈ సంఘటనపై వినోద్‌కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు