
జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి అండర్–22 విభాగంలో పురుషులు, మహిళల జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. బాస్కెట్‌బాల్ క్రీడా జిల్లా ప్రెసిడెంట్ చింతల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడా కారులు హాజరయ్యారు. పురుషుల విభాగంలో మదనపల్లికి చెందిన పి.చైతన్య, వి.దీపేష్, ఎ.మౌనీష్, ఎం.వెంకటసాయి, ఎంఎస్ నిహార్, వాల్మీకిపురానికి చెందిన కె.కార్తికేయ, ఎస్.రెడ్డిశ్రీకర్, ఎస్.క్రిష్ణ కౌశిక్, ఎం.తరుణ్‌కుమార్, టి.అరవింద్, ఎస్.నియాజ్, తరిగొండకు చెందిన హేమంత్ ఎంపికయ్యారు. మహిళల విభాగంలో మదనపల్లికి చెందిన కె.హిమశ్రీ, కె.కౌశల్య, సీటీఎంకు చెందిన హరిశ్రిత, రేణుక, వాల్మీకిపురానికి చెందిన ఇ.హిమజ, తరిగొండకు చెందిన జి.గాయత్రి, ఎల్.హర్షిత, సి.స్వాతి, ఎం.మమత, జి.గాయత్రి, రామాపురానికి చెందిన నిహారిక, గుర్రంకొండకు చెందిన భవ్యశ్రీ, సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌లుగా మరో నలుగురిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్ బాల్ క్రీడా జిల్లా కార్యదర్శి రవి, ఎంఈఒ సుబ్రహ్మణ్యం, పాఠశాల హెచ్‌ఎం వసుంధర, ఎస్‌ఐ చంద్రశేఖర్, పీడీలు కిరణ్, రెడ్డివరప్రసాద్, సీనియర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.