
రామయ్య సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయంలో వరలక్ష్మీ వ్రతం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలతో పవన్‌కుమార్, మనోజ్‌కుమార్‌లు శాస్త్రోక్తంగా వ్రతాన్ని చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే ధన, ధాన్య, ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. అనంతరం టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుస్తక ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ప్రశాంతి, ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, సూపరింటెండెంట్ హనుమంతయ్య, భక్తులు పాల్గొన్నారు.

రామయ్య సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం