ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్‌సీపీలోనే.. | YSRCP MPTC Sensational Facts On TDP Leaders | Sakshi
Sakshi News home page

ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్‌సీపీలోనే..

Mar 29 2025 1:56 PM | Updated on Mar 29 2025 1:56 PM

 YSRCP MPTC Sensational Facts On TDP Leaders

ఏలూరు: మా కుటుంబానికి వైఎస్సార్‌ అంటే ప్రాణం..  నా భర్త చివరి వరకూ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడిచారు.. ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్‌ వెంటే ఉంటాను తప్ప పార్టీని మాత్రం వీడను.. అంటూ తేల్చి చెప్పారు యలమంచిలి మండలం గుంపర్రు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ. ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం మండలపరిషత్‌ కార్యాలయానికి వచ్చిన ఆమెను.. మీరు కనిపించడం లేదని మీ కుమార్తె ఫిర్యాదు చేశారంటూ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 

అక్కడ కుటుంబసభ్యుల ద్వారా తమకు అనుకూలంగా ఓటు వేయాలని కూటమి నేతలు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోతానే తప్ప పార్టీని వీడనని సత్యశ్రీ తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు ఆమెను తిరిగి మండలపరిషత్‌ కార్యాలయం వద్ద దించి వెళ్లగా జరిగిన సంఘటనను సహచర సభ్యులకు సత్యశ్రీ కన్నీటి పర్యంతమవుతూ వివరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement