ఆ సీక్రెట్ యాప్ ఏంటి? నిమ్మగడ్డ..

YSRCP MP Vijaya Sai Reddy Satirical Tweet On Atchannaidu - Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీరుపై ట్విట్టర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యగ్యాస్త్రాలు సంధించారు. ‘ఏంటి అచ్చెన్నా.. నిమ్మాడ అంటే చంద్రబాబు రాసిచ్చిన దివాణమా?’ అని ప్రశ్నిస్తూ చురకలు అంటించారు. ‘మీరు డిక్టేట్ చేసిన వ్యక్తి తప్ప ఇంకొకరు సర్పంచ్ గా నామినేషన్ వేయకూడదా? అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ!’ అంటూ విజయసాయిరెడ్డి  ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి తన మరో ట్వీట్‌లో ‘ప్రజా మద్దతుతో 4 సీట్లు కూడా గెలవలేమని పచ్చ పార్టీ ఫిక్సయింది. అందుకే నిమ్మగడ్డ యాప్. ఎలక్షన్ కమిషన్ యాప్ ఉండగా ఈ సీక్రెట్ యాప్ ఏంటి?’ అని ప్రశ్నిస్తూ.. దీని కంట్రోల్ రూం టీడీపీ ఆఫీసులో పెట్టారా? చంద్రబాబును, చినబాబును నువ్వు జాకీలేసినా లేపలేవు నిమ్మగడ్డా? అంటూ దుయ్యబట్టారు. (చదవండి: కాపీల రాయుడు.. చంద్రబాబునాయుడు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top