YSRCP MP Vijaya Sai Reddy Comments On Second Day Of YSRCP Plenary Meeting 2022 - Sakshi
Sakshi News home page

MP Vijaya Sai Reddy: చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం

Published Sat, Jul 9 2022 10:20 AM | Last Updated on Sat, Jul 9 2022 5:12 PM

YSRCP MP Vijaya Sai Reddy Comments on Second Day of Plenary - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ బహిరంగ సభ కాదని.. ప్రతినిధుల సభ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'శుక్రవారం 1.68లక్షల మంది కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యారు.

ఇవాళ 4.5 లక్షల మందికిపైగా పార్టీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం ఎక్కడా జరగలేదు. చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం. 175కు 175 స్థానాలు గెలుస్తాం. 25 పార్లమెంట్‌ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని' విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

చదవండి: (ఉద్వేగం.. ఉత్సాహం: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో జోష్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement