
తిరువన్నామలై: వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీకి ప్రమాదం తప్పింది. అరుణాచలం వెళ్లి తిరిగి వస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కొండా రాజీవ్ సహా కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తిరువన్నామలై వద్ద ప్రమాదం జరిగింది.
కొండా రాజీవ్‌ని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. తిరువణ్ణామలై వద్ద రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన కొండా రాజీవ్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాజీవ్‌కి తగిన సహాయ చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు సజ్జల సూచించారు.

