వైఎస్సార్‌ మేనత్త కన్నుమూత | YS Kamalamma Passed Away in America | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ మేనత్త కన్నుమూత

Sep 14 2026 10:28 AM | Updated on Sep 14 2026 10:35 AM

YS Kamalamma Passed Away in America

అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస 

ఆమె మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

పులివెందుల(వైఎస్ఆర్ కడప జిల్లా): దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మేనత్త, వైఎస్‌ రాజారెడ్డి సోదరి వైఎస్‌ కమలమ్మ (88) ఆదివారం కన్ను మూశారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతు­న్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెను పులివెందులలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు పరామర్శించారు.

కమలమ్మ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ఆమె కుమార్తె మెర్సీ వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అక్కడే ప్రాణాలు విడిచారు. కమలమ్మ భౌతికకాయాన్ని పులివెందులకు తీసుకొచ్చి వైఎస్సార్‌ సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కమలమ్మ మృతిపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులతో పాటు, వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ కుటుంబ సభ్యులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement