అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ జగన్‌ రాఖీ శుభాకాంక్షలు | Ys Jagan Wishes Rakhi Purnima All Sisters | Sakshi
Sakshi News home page

అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ జగన్‌ రాఖీ శుభాకాంక్షలు

Aug 8 2025 8:06 PM | Updated on Aug 8 2025 8:26 PM

Ys Jagan Wishes Rakhi Purnima All Sisters

సాక్షి, తాడేపల్లి: రాఖీ పండుగ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

రక్షా బంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా.. మహిళలకు ఎప్పుడూ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement