
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రెండు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని రాత్రి అక్కడి నివాసంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.
అక్కడ దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్‌లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.